![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -324 లో.. పాపని కిడ్నాప్ చేసిన రౌడీల దగ్గరికి పాప అమ్మ మరియు అప్పు ఇద్దరు బయలుదేరి వెళ్తారు. రౌడీలు చూడకుండా పాప దగ్గరికి ఇద్దరు వెళ్లి పాపని తీసుకొని బయటకు వస్తుంటే రౌడీలు అడ్డుపడతారు.. నీకు డబ్బులు తీసుకొని రమ్మని చెప్పాను కదా.. ఎవరినో తీసుకొని వచ్చావని పాప అమ్మని రౌడీలు బెదిరిస్తుంటారు. అప్పుడే పోలీసులు వస్తారు. మీ సంగతి తెలిసే మీరు ఇక్కడ ఉన్నారని తెలిసినప్పుడే పోలీసులకి చెప్పానని అప్పు అంటుంది. ఆ తర్వాత చాలా థాంక్స్ అంటు అప్పుకి పాప వాళ్ళ అమ్మ చెప్తుంది.. పోలీసులు కూడా అప్పుని అభినందిస్తారు.
ఆ తర్వాత కావ్య మోడరన్ గా రెడీ అయి ఆఫీస్ కి వస్తుంటే రాజ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి పడిపోయారా అంటూ రాజ్ దగ్గరికి వస్తుంది.. ఇలా బాగున్నారని ఓ ఎంప్లాయ్ చెప్తుంది. కావ్య ఆలా రెడీ అవడం రాజ్ చూడలేకపోతాడు. ఆ తర్వాత అప్పుడే రాజ్ కి శ్వేత ఫోన్ చేసి కలుస్తాను అన్నావని అనగానే.. ఎక్కడో ఎందుకు ఆఫీస్ కి రా అని రాజ్ అంటాడు. ఇప్పుడు ఆ కావ్యకి మండిపోవాలని రాజ్ అనుకుంటాడు. మరొక వైపు ఆ కావ్య ఎందుకు ఆఫీస్ కి వెళ్తుందని ఆలోచిస్తుంది రుద్రాణి. అప్పుడే రాహుల్ కూడా వస్తాడు.. ఇద్దరికి నిశ్శబ్దంగా గొడవలు జరుగుతున్నాయని అనిపిస్తుంది. తను జాబ్ చెయ్యడానికి ఇష్టపడని కావ్య.. ఎందుకు రాజ్ వెంట వెళ్తుంది. రాజ్ ఏదో తప్పు చేస్తున్నాడు ఆ విషయం కనుక్కోవడానికి కావ్య వెళ్తుంది. అదే నిజమైతే రాజ్ తప్పు చేసాడని మనం నిరూపించాలి. అలా నిరూపిస్తే రాజ్ తప్పు చేసిన ఆఫీస్ బాధ్యత చేస్తున్నాడు. నా కొడుకు తప్పు చేసాడు అంటున్నారు కదా.. అలా అయితే మా వాడికి ఆఫీస్ బాధ్యతలు ఇవ్వాలని ఇంట్లో వాళ్లని అడుగుతానని రుద్రాణి అనగానే రాహుల్ మంచి ప్లాన్ అని అంటాడు.
ఆ తర్వాత శ్వేత ఆఫీస్ కి వస్తుంది. రాజ్ కావాలనే కావ్య ముందు శ్వేతతో క్లోజ్ గా ఉన్నట్లు బెహేవ్ చేస్తాడు. ఏకంగా ఆఫీస్ కి రప్పించుకున్నాడన్నమాట అని కావ్యకి కోపం వస్తుంది. కావ్య కావాలనే వాళ్ళు ఉన్న దగ్గరికి వచ్చి సెటైర్ వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మన ఫ్రెండ్ షిప్ ని తప్పుగా అర్థం చేసుకుంటుందని శ్వేత అంటుంది. మరొకవైపు వాళ్ళు అలా క్లోజ్ గా ఉండడం చూడలేకపోతుంది కావ్య. ఆ తర్వాత కావ్య మన గురించి అలా అనుకోవడం నాకు నచ్చడం లేదని శ్వేత అనగానే.. కొందరు మూర్ఖులు అంతకు మించి ఏం అర్థం చేసుకుంటారని రాజ్ అంటడు. తరువాయి భాగంలో నువ్వు ఎంత చెప్పిన నేను కన్విన్స్ కాలేకపోతున్నానని శ్వేత అంటుంది. అది కావ్య వింటుంది. కావ్యని చుసిన రాజ్ కావాలనే.. శ్వేతపై చెయ్యి వేసి త్వరగా వెళ్ళని చెప్తాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |